తాలిబ‌న్ల‌పై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు…

ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా ఉండే పాక్‌, వారిపై సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌డం స‌హ‌జ‌మే.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలీబ‌న్‌ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు పాక్ ఇప్ప‌టికే ప‌దివేల మందికి పైగా ముష్క‌రుల‌ను ఆ దేశం పంపిన‌ట్టు ఇప్ప‌టికే మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.  ఇక ఇదిలా ఉంటే,  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్ర‌మించుకున్నామ‌ని ఇప్ప‌టికే తాలిబ‌న్లు చెప్తూ వ‌స్తున్నాయి.  చిన్నారుల‌ను, మ‌హిళ‌ల‌ను హింసిస్తున్నారు.  వేలాది మంది అమాయ‌క ప్ర‌జ‌ల‌ను తాలిబ‌న్లు పొట్ట‌న పెట్టుకుంటున్నారు.  ఇలాంటి వారిపై పాక్ ఉదార‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది.  తాలిబ‌న్లు మిల‌ట‌రీ డ్ర‌స్ వేసుకున్నంత మాత్రానా వారు ఉగ్ర‌వాదులు కాద‌ని, వారంతా సామాన్య‌పౌరులే అని  పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.  

Read: ఛాలెంజ్ యాక్సెప్టెడ్… నయనతార “నేత్రికన్” ట్రైలర్

ఇమ్రాన్ ఖాన్ చెప్పిన పాక్ స‌రిహ‌ద్దుల్లో తాలిబ‌న్ వ‌ర్గానికి చెందిన దాదాపు 30 ల‌క్ష‌ల మంది ఆఫ్ఘ‌నిస్తానీయులు పాక్ స‌రిహ‌ద్దుల్లో ఉన్నార‌ని, అలాంట‌ప్పుడు వారిని ఎలా బందిస్తామ‌ని అన్నారు.  అఫ్గాన్‌ శరణార్థుల్లో మెజారిటీ ప్రజలు పష్తూన్‌ వర్గానికి చెందిన వారే ఉన్నారని అమెరికా మీడియా సంస్థ పీఎస్‌బీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.  అమెరికా సైన్యం ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి త‌ప్పుకున్నాక తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.  తాలిబ‌న్ల‌కు పాక్ సుర‌క్షిత ప్రాంతంగా మారింద‌ని అమెరికా మాజీ సైనికాధికారి పేర్కొన్నారు.  

Related Articles

Latest Articles

-Advertisement-