ముద్దులు అయిపోయాయి! జిమ్ములో పద్దులు లెక్కెడుతోన్న సీరియల్ కిస్సర్!

పాము కుబుసం విడిచినట్టు కమర్షియల్ సినిమా హీరోలు, హీరోయిన్స్ కూడా ఎప్పుడో ఓ సారి అధిక కవ్వు వదిలించుకోక తప్పదు! ఆ టైం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి వచ్చింది! ‘మర్డర్’ లాంటి సినిమాల్లో తన ‘పెదవుల’ పనితనంతో బాగా ఫేమస్ అయిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు కండలతో కలకలం రేపాడు…ఇమ్రాన్ హష్మీ గతంలో ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించలేదు. తన సినిమాల్లో రొమాన్స్ అండ్ పర్ఫామెన్స్ తోనే నెట్టుకొచ్చాడు. కానీ, లెటెస్ట్ గా ఆయన కూడా జిమ్ లో జిగేలుమన్నాడు! సరికొత్త యాబ్స్ తో ఫోటో తీసుకుని ‘ఇది ఆరంభం మాత్రమే’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇంటర్నెట్ లో వదిలాడు! ముందు ముందు ఇంకా ఎలాంటి పర్ఫెక్ట్ ఫిజిక్ తో షాకిస్తాడోగానీ… ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నారు…

read also : సూపర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్!


ఇమ్రాన్ హష్మి తన కొత్త కండలు తిరిగిన లుక్ తో ‘టైగర్ 3’ సినిమాలో కనిపించబోతున్నాడు. అందులో ఆయన హీరో కాదు. విలన్! అందుకే, బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కండల వీరుడు సల్మాన్ తో కుస్తీ పట్టేందుకు ఈ న్యూ సిక్స్ ప్యాక్ సుందరుడు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. ‘టైగర్’లో సల్మాన్ అండ్ ఇమ్రాన్ ఫేస్ ఆఫ్ ఫైట్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటాయట! చూడాలి మరి, తెర మీద కనిపించిన ప్రతీసారి కిస్ చేయటం హష్మి స్టైల్. అస్సలు కిస్ చేయకపోవటం సల్లూ స్టైల్. ఈ ఇద్దరు అపోజిట్ పోల్స్ మనల్ని తమ అప్ కమింగ్ మూవీలో ఎలా అలరిస్తారో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-