దీదీకి సుప్రీంకోర్టు షాక్‌.. ఆ ప‌థ‌కం అమ‌లు చేయాల్సిందే..

బీజేపీ, టీఎంసీ మ‌ధ్య ఓ రేంజ్‌లో యుద్ధం న‌డుస్తూనే ఉంది.. ఎన్నిక‌లు ముగిసినా ఆ వివాదాల‌కు ఫులిస్టాప్ ప‌డ‌డం లేదు.. అయితే, ఈ వివాదాల కార‌ణంగా కొన్ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కానీ, వ‌న్ నేష‌న్ – వ‌న్ రేష‌న్ విష‌యంలో కీల‌క ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ప‌శ్చిమ బెంగాల్‌లో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సీఎం దీదీని ఆదేశించింది అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి ఎలాంటి సాకులు చూపకుండా, వెంటనే అమలు చేయాలని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు.. ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది.. అమ‌లుకు స‌మ‌స్య‌ల‌ను వెత‌క‌కుండా వెంట‌నే ఈ పథకాన్ని అమలు చేయాల‌ని బెంగాల్ ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది.. సుప్రీం ఆదేశాల‌తో దీదీకి షాక్ త‌గిలిన‌ట్టు అయ్యింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-