వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌: త్వ‌ర‌లో మ‌రో రెండు తుఫాన్లు…

ఇటీవ‌ల వ‌చ్చిన గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోలేదు. తీర‌ప్రాంతంలోని గ్రామాలు అనేకం ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎక‌రాల్లో పంట నీటిపాలైంది. దీంతో అన్న‌దాత‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేర‌డంతో ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. చేప‌ల వేట‌కు వెళ్లే విష‌య‌మై మ‌త్స్య‌కారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గులాబ్ తుఫాన్ కార‌ణంగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రిలో నీటిమ‌ట్టం పెరిగింది. ఈ గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే వాతావ‌ర‌ణ శాఖ మ‌రో హెచ్చ‌రిక చేసింది. ఈ నెల‌లో మ‌రో రెండు తుఫానులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఈనెల 14, 15 తేదీల్లో ఒక తుఫాన్‌, ఈనెల 21 త‌రువాత మ‌రోక తుఫాన్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, తీరప్రాంతాల్లోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

Read: లైవ్‌: ఏపీ సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా స్వేచ్ఛ కార్య‌క్ర‌మం ప్రారంభం

-Advertisement-వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌:  త్వ‌ర‌లో మ‌రో రెండు తుఫాన్లు...

Related Articles

Latest Articles