అక్రమాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారిన విజయవాడ మహేష్ ఆస్పత్రి…

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్సుగా విజయవాడ మహేష్ ఆస్పత్రి మారిపోయింది. కరోనా పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తుంది మహేశ్ ఆస్పత్రి. అయితే ఈ అక్రమాలపై ఎన్టీవీకి సమాచారం అందింది. మహేష్ ఆస్పత్రి యాజమాన్యంపై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతోన్నారు బాధితులు. రెండు లక్షల కడితేనే తప్ప చేర్చుకునేదే లేదంటూ స్పష్టం చేస్తుంది మహేష్ ఆస్పత్రి. డబ్బులు గుంజుతోన్నా.. ట్రీట్మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోన్న మహేష్ ఆస్పత్రి యాజమాన్యం నర్సులతోనే ట్రీట్మెంట్ అందిస్తుంది అని బాధితులు తెలిపారు. ఆక్సిజన్ అందక ఆస్పత్రిలోని రూం నుంచి రోడ్ మీదకు పరుగు పెట్టాల్సి వచ్చిందన్న బాధితుడు… బిల్లులిచ్చేదే లేదని ముందుగానే స్పష్టం చేస్తుంది మహేశ్ ఆస్పత్రి యాజమాన్యం. ఇన్సూరెన్స్ క్లైమ్ చేయాలన్నా బిల్లులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు బాధితులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-