బంగారాన్ని పేస్టుగా చేసి..?

ఈమధ్య కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్‌, బంగారం పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్‌, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహ్రయిన్ ప్రయాణీకుడి వద్ద రెండు కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా చేసి కాళ్లకు వేసుకునే సాక్స్ లోదాచాడు కేటుగాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలల్లో ఈ అక్రమ బంగారం బయటపడింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-