ఐఐటి కాన్పూర్ అద్భుతం: కృత్రిమ గుండె త‌యారీకి శ్రీకారం…

ఐఐటి కాన్పూర్ మ‌రో అద్భుతానికి శ్రీకారం చుట్టింది.  క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో వెంటిలేట‌ర్లు, ఆక్సీజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్ల‌ను త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారు చేసి ఔరా అనిపించింది.  క‌రోనా స‌మ‌యంలో ఈ వెంటిలేట‌ర్లు, ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డ్డాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  కాగా, ఇప్పుడు కృత్రిమ గుండెను త‌యారు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నది కాన్పూర్ ఐఐటి.   రీచార్జ్ చేసుకునే విధంగా బ్యాట‌రీతో ప‌నిచేసే కృత్రిమ గుండెను త‌యారు చేస్తున్న‌ది.  రెండేళ్ల‌ల‌తో ఈ కృత్రిమ గుండెను రెడీ చేస్తామ‌ని, అనంత‌రం జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తామ‌ని ఐఐటి కాన్పూర్ ప్రొఫెస‌ర్ బంధోపాధ్యాయ్ తెలిపారు.  

Read: ‘ప్రేమ కావాలి’ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

దీనికోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు పేర్కొన్నారు.  ఈ కృత్రిమ గుండె త‌క్కువ ధ‌ర‌కు అందించేలా త‌యారు చేస్తామ‌ని అన్నారు.  ప్ర‌స్తుతం విదేశాల నుంచి కృత్రిమ గుండెను దిగుమ‌తి చేసుకుంటున్నారు.  చాలా ఖ‌ర్చుతో కూడిన విష‌యం కావ‌డంతో కొంద‌రికి మాత్ర‌మే అందుబాటులో ఉంటున్న‌ది.  పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కృత్రిమ గుండెను త‌యారు చేస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ఐదేళ్ల‌లో ఈ గుండె అందుబాటులోకి వ‌స్తుంది.  

Related Articles

Latest Articles