భార‌త శాస్త్రవేత్తల పరిశోధన‌: 37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు.  ఇప్ప‌టికే దేశంలో మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  మ‌రికొన్ని టీకాలు ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న టీకాల‌ను శీత‌లీక‌ర‌ణ గ‌డ్డంగుల్లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన టీకాలే.  ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వ‌ర‌కు ఫ్రీజింగ్ చేయాలి.  ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ధ స్టోర్ చేయాలి.  అయితే, ఇండియాలోని గ్రామ‌ల్లో ఇలా ఫ్రీజింగ్ చేయ‌డం కుద‌ర‌నిప‌ని.  

Read: ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “బీస్ట్” బ్యూటీ

పైగా భార‌త్‌లో ఉష్ణోగ్ర‌తలు అధికంగా ఉంటాయి.  ఈ వాతావ‌ర‌ణానికి త‌గిన విధంగా టీకాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భార‌త్‌కు చెందిన ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన మైన్‌వ్యాక్స్‌ సంస్థ‌లు క‌లిసి ఓ టీకాను అభివృద్ధి చేసింది.  ఈ టీకా అన్ని ర‌కాల వేరియంట్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటుంద‌ని, 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నెల రోజుల‌పాటు నిల్వ ఉంటుందని, 100 డిగ్రీల వేడిలో 90 నిమిషాల వ‌ర‌కూ టీకా దెబ్బతినకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  త్వరలోనే ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ను నిర్వహిస్తామని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ శేషాద్రి వాస‌న్ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-