డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో చోరీ.. ఆపై వింత లేఖ..!

వీళ్లు మామూలు దొంగల కాదు.. ఎందుకంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్‌ ఇంటికే కన్నం వేశారు.. ఉన్నకాడికి ఊడ్చేశారు.. అయినా వారికి ఏదో వెలితి అనిపించినట్టుంది… ఎందుకంటే.. దొంగతనం చేసింది డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో.. దొరికిన నగదు చాలా తక్కువ అని ఫీలయ్యారేమో.. అక్కడ ఓ లేఖను వదిలివెళ్లారు.. ఆ తర్వాత ఆ లేఖ చూసిన డిప్యూటీ కలెక్టర్‌ షాక్‌ తిని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మ‌ధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరరిగింది..

ఆ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు సమీంలోని సివిల్ లైన్స్‌లోని త్రిలోచ‌న్ గౌర్ బంగ్లాలో ఓ డిప్యూటీ క‌లెక్టర్ నివాసం ఉంటున్నాడు. అయితే, ఆ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో దొంగ‌లు ప‌డ్డారు. ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, బంగారు ఆభ‌ర‌ణాలు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు.. అయితే, అక్కడ ఒక లేఖ కూడా వదిలివెళ్లారు.. ఆ లేఖలో ఏముందంటే.. “జబ్ పైసే నహీ వారు తోహ్ లాక్ నహీ కర్నా థా నా కలెక్టర్ (ఇంట్లో డబ్బు లేనప్పుడు లాక్‌ ఎందుకు వేశారు, కలెక్టర్) అంటూ హిందీలో ఓ చీటి రాసి అక్కడ వదిలివెళ్లారు. ఇక, 15-20 రోజుల తర్వాత తిరిగొచ్చిన డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించారు.. అదే సమయంలో ఆ లేఖ ఆయన కంటపడింది.. ఆ లేఖను పోలీసులకు అందజేసి.. ఇంట్లో రూ. 30 వేలు, బంగారు ఆభ‌ర‌ణాలు అప‌హ‌రించిన‌ట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. మొత్తంగా దొంగల చేసిన ఆ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

-Advertisement-డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో చోరీ.. ఆపై వింత లేఖ..!

Related Articles

Latest Articles