మధ్యప్రదేశ్ లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెరైటీ శిక్ష… 

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు.  భారీ జరిమానాలు విధిస్తున్నారు.  అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారికి విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు.  మధ్యప్రదేశ్ లోని సత్నాలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి రామనామం పుస్తకం ఇచ్చి నాలుగు పేజీలు రామనామం రాయిస్తున్నారు. పేపర్ పై నాలుగు పేజీలు రాయడం అంటే మామూలు విషయం కాదు.  రామ నామం రాయడం వలన పుణ్యం వస్తుందని, తప్పు చేసినందుకు ఇలా శిక్ష విధించడం మంచిదే అని అంటున్నారు పోలీసులు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-