ఆస్ట్రేలియాలో 2 ఓమిక్రాన్ వైరస్‌ కేసుల గుర్తింపు

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్‌ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొత్త వేరింయంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ విదేశీ ప్రయాణాల్లో నిబంధనలను కఠినతరం చేశాయి.

పర్యాటకులపై ఆధారపడిన థాయిలాండ్, ఇటీవలే కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన ఆంక్షలను విధించింది. ఎనిమిది ఆఫ్రికన్ కౌంటీల నుండి సందర్శకులపై నిషేధాన్ని ప్రకటించింది. సింగపూర్‌లోనూ ఇదే తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఏడు దక్షిణాఫ్రికా దేశాలకు ఆయా దేశాలు తమ అంతర్జాతీయ రవాణాను నిలపివేశాయి. మాల్దీవులు అనుసరించిన వ్యూహాన్నే శ్రీలంక అమలు చేస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడం వల్ల ఆరు ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై ఈ రెండు దేశాలు నిషేధం విధించాయి.

Related Articles

Latest Articles