ఆనంద‌య్య మందుపై ఐసీఎంఆర్ ప‌రిశోధ‌న లేన‌ట్టేనా?

ఆనంద‌య్య త‌యారు చేసిన మెడిసిన్ ఆయుర్వేద‌మా కాదా అని నిర్ధారించేందుకు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే ఆయుష్ సంస్థ ఈ మెడిసిన్ పై అద్య‌య‌నం మొద‌లుపెట్టింది.  ఈ మెడిసిన్ వినియోగించిన వ‌స్తువులు అన్నీ కూడా ఆయుర్వేదంలో వినియోగించే వ‌స్తువులుగా నిర్ధారించిన సంగ‌తి తెలిసిందే.  ఈ మెడిసిన్ వ‌ల‌న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవ‌ని ఆయుష్ తెలిపింది.  అయితే, ఐసీఎంఆర్ నిపుణులు ఈ మందును ప‌రిశీలించాల్సి ఉంది.  తాజా స‌మాచారం ప్ర‌కారం, ఈ మందును ఐసీఎంఆర్ ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేదని అధికారులు భావిస్తున్నారు.  సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ ఈ మెడిసిన్ ను ప‌రీశీలిస్తోంది.  ఆయుష్ నివేదిక‌ను ఆయుర్వేదిక్ సైన్స్ ప‌రిశీస్తోంది. ఈ ప‌రిశీల‌న అనంత‌రం తుది నివేదిక ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  ఆయుష్‌, సిసిఆర్ఏఎస్ ఆనంద‌య్య మందు ఆయుర్వేద‌మే అని తేల్చితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మెడిసిన్ ను పంపిణీ చేసే అవ‌కాశం ఉంటుంది. 

Related Articles

Latest Articles