బూస్టర్‌ డోస్‌పై ఐసీఎంఆర్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో కరోనా బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై ఐసీఎంఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరూ వేసుకుంటే మంచిదని, మరికొందరూ రెండు డోసులు కాకుండా ఇంకొటి కూడా వేసుకోవాలా అంటూ పెదవి విరుస్తున్నారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్‌ డోసు తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటూరోగాల విభాగం హెడ్‌ సమీరన్‌ పాండా తెలిపారు. ప్రజా ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమని ఆయనతెలిపారు.

శాస్ర్తీయ ఆధారాలు, ఎన్‌టీఏజీఐ చెప్పే వాటిని ఆరోగ్య శాఖ అమలు చేస్తుందన్నారు. ఏదైనా పాలసీ తీసుకోవాలంటే ఈ రెండు చేసే సూచ నలు కీలకమన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బూస్టర్‌ డోస్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా బూస్టర్ డోసుల కన్నా దేశంలో 80శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతానికి ఇంతకన్నా వేరే మార్గం లేదన్నారు. ఈ అవసరం కూడా ఎక్కువ ఉందన్నారు. రెండు డోసుల టీకా తీసు కోవడం వల్ల కరోనాను ఎదుర్కొవడానికి సంసిద్ధులై ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Latest Articles