సుశాంత్ కొత్త సినిమా ఆహాలో ఎప్పుడంటే….

సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆగస్ట్ 27న జనం ముందుకు వచ్చింది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయిలగుండ్ల నిర్మించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆహా సంస్థ తెలిపింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఈ డీసెంట్ లవ్, థ్రిల్లింగ్ డ్రామా ఓటీటీ ద్వారా వీక్షకుల మెప్పును పొందుతుందేమో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-