ఇండియా – పాక్ మ్యాచ్ కొత్త రికార్డు.. ప్రకటించిన ఐసీసీ

యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తన ప్రయాణాన్ని పాకిస్థాన్ తో మొదలు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక తాజాగా ఈ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు అని ఐసీసీ ప్రకటించింది. మన జట్టు ఓడిపోయినా.. ఇండియాలోనే ఈ మ్యాచ్ ను అత్యధికంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు అభిమానులు చూసారు. ఇక ఇన్ని రోజులు ఈ అత్యధిక విక్షణ రికార్డు 2016 టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ – వెస్టిండీస్ తలపడిన మ్యాచ్ పేరిట ఉండేది. కానీ ఇప్పుడు ఇది దానిని బ్రేక్ చేసింది. అయితే ఈ ఏడాది భారత్ సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన… మన దేశంలోనే ఈ టోర్నీని అత్యధికంగా 112 బిలియన్ నిమిషాలపాటు చూసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక గతంతో పోలిస్తే ఈసారి భారత్ – పాక్ మ్యాచ్ ను పాకిస్థాన్ లో 7.3 శాతం అధికంగా చూడగా… ఇంగ్లాండ్ లో 60 శాతం, ఆస్ట్రేలియాలో 175 శాతం ఎక్కువ మంది చూసారు.

Related Articles

Latest Articles