టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్

ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే అక్కడ ఎటువంటి ఐసీసీ ఈవెంట్లు జరగలేదు. కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ పాకిస్థాన్ కు ఆ అవకాశం వచ్చింది.

ఇక తాజాగా దీని పైన ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ క్రికెట్ ఈవెంట్ పాకిస్థాన్ కు తిరిగి వెళ్తుంది. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తప్ప… అంతకముందు మిగతావన్నీ ఎటువంటి సమస్యలు లేకుండా అక్కడ జరిగాయి” అని బార్క్లే అన్నారు. అయితే పాకిస్థాన్ లో జరిగే ఈ టోర్నమెంట్‌ లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది. కానీ ఈ ఈవెంట్ కు భారత్ తో కలిపి అని దేశాల జట్లు తప్పక వస్తాయని బార్క్లే చెప్పారు. అలాగే క్రికెట్ ఈ రెండుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడగలదని అన్నారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles