కొత్త సీఈఓ పేరు ప్రకటించిన ఐసీసీ…

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు జియోఫ్ అల్లార్డిస్‌ ను కొత్త శాశ్వత సీఈఓగా నియమించింది. అల్లార్డిస్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు. క్రికెట్ ఆస్ట్రేలియాలో గతంలో ఇదే విధమైన పాత్రను నిర్వహించి… ఎనిమిదేళ్లపాటు ఐసీసీ జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. ఇక ఐసీసీ సీఈఓ గా నియమించినబడిన తర్వాత అల్లార్డిస్ మాట్లాడుతూ… “ఐసీసీ కి సీఈఓ గా నియమించబడటం గొప్ప అదృష్టం. అలాగే ఆటలో కొత్త దశ వృద్ధిలోకి ప్రవేశించినప్పుడు క్రీడను నడిపించే అవకాశం ఇచ్చినందుకు ఐసీసీ బోర్డుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత ఎనిమిది నెలలుగా ఐసీసీ సిబ్బంది నాకు ఇచ్చిన మద్దతు కోసం నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇటువంటి ప్రతిభావంతులైన జట్టుతో క్రికెట్‌ కు సేవ చేయడం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఐ తెలిపారు.

Related Articles

Latest Articles