సంకల్ప్ రెడ్డి హిందీ చిత్రం ‘ఐబి 71’ షూటింగ్ షురూ!

రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’.

1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్‌ బ్యూర్ పాత్రను తెలియచేసే ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ గూడఛారిగా నటిస్తున్నాడు. దీని షూటింగ్ గురువారం మొదలైంది. ఈ చిత్రానికి భూషణ్ కుమార్ తో పాటు రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. కొత్త సంవత్సరంలో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విద్యుత్ జమ్వాల్ ఈ కథ రూపకల్పనకు స్ఫూర్తిదాతలైన ఇంటెలిజెన్స్ అధికారుకులకు కృతజ్ఞతలు తెలిపాడు. తెలుగు దర్శకులు కొంతమంది తమ సినిమాల రీమేక్స్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంటే… సంకల్ప్ రెడ్డి హిందీలో డైరెక్ట్ మూవీ తీస్తుండటం విశేషం.

Related Articles

Latest Articles