ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ఏపీ అధికారులు

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు. వీరితో ఢిల్లీ నుంచి చీఫ్‌ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర వర్చువల్‌ బ్రీఫింగ్‌ ద్వారా మాట్లాడారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేయాల్సిన విధులను వీరికి వివరించారు.

Read Also: ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

ఏపీ నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్న 35 మంది ఐఏఎస్,9 మంది ఐపీఎస్ అధికారులు. సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు. ఎన్నికల పరిశీలకులుగా అనుసరించాల్సిన విధి విధానాలు ఇతర మార్గదర్శకాలను గురించి వివరించిన సీఈసీ సుశీల్ చంద్ర. వీరందరికి కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ను వేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

Related Articles

Latest Articles