త్వరలోనే తెలుగు సినిమా చేస్తా: మణిరత్నం

తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘నవరస’ వెబ్ సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను.. తొమ్మిది భాగాలుగా.. తొమ్మిది మంది దర్శకులతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. కాగా నవసర ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే చాలా విషయాలు ముచ్చటించిన ఆయన.. ఖచ్చితంగా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబు-మణిరత్నం సినిమాపై వస్తున్న గాసిప్స్ పై స్పందించారు. మహేష్‌ కు స్క్రిప్ట్ వినిపించిన మాట వాస్తవమేనని.. కానీ ఆ సమయంలో అది వర్కౌట్‌ కాలేదని తెలిపారు. ఇద్దరం కలిసి పనిచేయాలంటే ఏదైనా కథే నిర్ణయించాలని మణిరత్నం చెప్పుకొచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-