బాక్’సింగ్’ బయోపిక్ కి షాహిద్ రెడీ…

కరోనా వల్లనే కాదు క్యాన్సర్ వల్ల కూడా గత కొంత కాలంగా ఎందరో ప్రముఖులు మరణిస్తున్నారు. బాలీవుడ్ లో రిషీ కపూర్, ఇమ్రాన్ ఖాన్ అదే వ్యాధితో అకాల మరణం పాలయ్యారు. ఇక ఈ గురువారం నాడు 42 ఏళ్ల బాక్సర్ డింగ్కో సింగ్ లివర్ క్యాన్సర్ కారణంగా తుది శ్వాస విడిచాడు. పద్మశ్రీ పురస్కారం పొందిన ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కూడా డింగ్కో ఎప్పటికీ గొప్ప ప్రేరణ అని వ్యాఖ్యానించాడు…

1998లో ఏషియన్ గేమ్స్ బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన డింగ్కో సింగ్ అర్జున అవార్డ్ గ్రహీత కూడా. అయితే, ఆయన బయోపిక్ తీయాలని షాహిద్ ఎప్పట్నుంచో భావిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం సినిమా తీసేందుకు అవసరమైన హక్కులు కూడా తన వద్ద ఉన్నాయని షాహిద్ చెప్పాడు. డింగ్కో సింగ్ నుంచీ అనుమతి కూడా పొందిన బాలీవుడ్ స్టార్ ఎందుకోగానీ, రాజా కృష్ణ మెనన్ దర్శకత్వంలో సదరు సినిమా ఇప్పటి వరకూ చేయలేకపోయాడు. డింగ్కో బ్రతికి ఉండగా ఆయన బయోపిక్ చేయలేకపోయినందుకు హీరో షాహిద్, దర్శకుడు రాజా కృష్ణ మెనన్ ఇద్దరూ తమ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

దేశానికి గొప్ప పేరు తెచ్చిన టాలెంటెడ్ బాక్సర్ డింగ్కో సింగ్ బయోపిక్, తప్పక తాను చేస్తానని, షాహిద్ మరోమారు పేర్కొన్నాడు. చూడాలి మరి, నెక్ట్స్ తెలుగు మూవీ ‘జెర్సీ’ రీమేక్ లో కనిపించబోతోన్న ‘కబీర్ సింగ్’ స్టార్ ఎంత త్వరగా దివంగత క్రీడాకారుడి జీవిత కథని కెమెరా ముందుకు తీసుకువెళతాడో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-