గాల్లో పర్యటిస్తే తెలియదు.. వరదప్రాంతాల్లో తిరగాలి: జ్యోతుల నెహ్రూ


ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాలో ప్రస్తుతం ప్రకృతి విపత్తు వలన అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడ కనిపించడం లేదని ఆయన అన్నారు. గాల్లో పర్యటిస్తే.. ఎంత నష్టం వాటిల్లిందో తెలియదు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఎంత నష్టం వాటిల్లిందో అప్పుడు తెలస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఎంత నష్టంమైందో ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. డెల్టా ప్రాంతాల్లో కూడా నష్టం ఏర్పడింది. అధికారం కోసం వేల కిలోమీటర్లు తిరిగిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ముంపు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ముంపు ప్రాంతాల్లో ఆలస్యంగా వెళ్ళిన వైసీపీ నాయకులపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు జ్యోతుల నెహ్రూ. వ్యవసాయశాఖ మంత్రి వరి పంట వెయ్యవద్దు అనడం దారుణమన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. విద్యుత్‌ కొరత రాబోతుందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిని బట్టి పంటలు వేయొద్దని వ్యవసాయ శాఖ అంటుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రికి అసలు ఆ శాఖ పైనా ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు, వరద బాధితులకు వెంటనే జిల్లాల వారీగా నష్టపరిహారం అందించాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Related Articles

Latest Articles