మా అధ్య‌క్షుడిగా వారి రాజీనామాను అంగీక‌రించ‌ను…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు ఎన్నిక‌లు ముగిశాయి.  మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు విజ‌యం సాధించారు.  విష్ణు విజ‌యం సాధించిన త‌రువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.  మా అధ్య‌క్షుడిగా విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  మా మెంబ‌ర్స్‌కు సేవ చేసేందుకు త‌న‌ను ఎన్నుకున్నందుకు విష్ణు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  మా ప్యాన‌ల్‌లో అంద‌రూ గెల‌వ‌క పోవ‌డం నిరాశ‌గా ఉంద‌ని అన్నారు.  అవ‌తలి ప్యాన‌ల్‌లో గెలిచిన మా వాళ్లే అని అన్నారు.  నాగ‌బాబు మా కుటుంబ స‌భ్యులు అని, మా పెద్ద‌ల్లో నాగ‌బాబు కూడా ఒక‌ర‌ని అన్నారు.  తాను ఒక ప్రెసిడెంట్ గా నాగ‌బాబు రాజీనామాను అంగీక‌రింబోన‌ని అన్నారు.  ప్ర‌కాష్‌రాజ్ రాజీనామాను కూడా అంగీక‌రించ‌న‌ని, గెలుపోట‌ములు ఎప్పుడు మ‌న‌తో ఉండ‌వ‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుస్తాన‌ని అన్నారు.  లోక‌ల్‌, నాన్ లోక‌ల్ పై బైలాస్‌ను మారుస్తామ‌ని చెప్ప‌లేద‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.  ఇత‌ర దేశాల వాళ్ల‌ను కూడా మా కోరుకుంటోంద‌ని, నాన్ తెలుగు ఫ్యాక్ట‌ర్ ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూసింది అంటే తాను న‌మ్మ‌న‌ని మంచు విష్ణు తెలిపారు.  

Read: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌: దేశంలో బొగ్గుకు కొర‌త లేదు…

-Advertisement-మా అధ్య‌క్షుడిగా వారి రాజీనామాను అంగీక‌రించ‌ను...

Related Articles

Latest Articles