పిల్లి కోసం తపన.. ఆచూకీ చెబితే రూ.30 వేల రివార్డు..

మనుషులు తప్పిపోయినా ఫిర్యాదు చేసేందుకు వెనుకడు వేసేవారున్నారు.. పీడ విరగడైపోయింది అనుకునేవారూ లేకపోలేదు.. కానీ, తాము గారభంగా పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది.. తప్పిపోయింది పిల్లేకదా అంటూ పోలీసులు లైట్ తీసుకున్నారు.. కేసు నమోదు చేయలేదు.. దీంతో.. తానే ఇలిల్లు తిరుగుతూ పిల్లకోసం వెతికింది.. అయినా ఆ పిల్ల ఆచూకీ దొరకకపోవడంతో.. మీడియాను పిలిచి.. తన గోడు వెల్లబోసుకుంది.. తన పిల్లి ఆచూకీ చెబితే ఏకంగా 30 వేల రూపాయలు రివార్డుగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా.. జంతు ప్రేమికురాలు. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతుంది. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని అడప్ట్ చేసుకుంది. అప్పటి నుండి జింజర్ ను ప్రేమగా పెంచుకుంది. కరోనా నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని పెట్ క్లినిక్‌లో జూన్ 17న పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించింది.. అయితే, కుట్లు వేసిన దగ్గర స్వేల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే ఆస్పత్రికి పిల్లిని తీసుకెళ్లింది. ట్రీట్‌మెంట్‌ జరుగుతుండగా జూన్ 24న హాస్పిటల్ నుండి పిల్లి తప్పిపోయిందంటూ ఆమెకు సమాచారం ఇచ్చారు ఆస్పత్రి సిబ్బంది… దీనిపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీసిన ఆమెకు వారి నుండి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో.. జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కానీ, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో , తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పంప్లెంట్స్ పంచుతూ పిల్లి కోసం వెతికింది.. అయినా దాని ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు.. దీంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. మీడియా ముందు విలపించారు.. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని.. ఆ పిల్లి ఆచూకీ తెలిపిన వారికి ముప్పై వేల రివార్డు కూడా ఇస్తానంటూ ప్రకటించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-