మానవత్వం చాటుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఫిదా !

హైదరాబాద్‌ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్‌ పేట, అంబ‌ర్‌పేట‌, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్‌ జామ్‌ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట ప్రధాన రహదారి పై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మలక్‌ పేట ఏరియాలోని ట్రాఫిక్ లో ఐదు అంబులెన్స్ లు చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యం లో అక్కడే విధులు నిర్వహిస్తున్న మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు… వెంటనే స్పందించి… మానవత్వాన్ని చాటు కున్నారు. అంబులెన్స్‌ లకు రూట్ క్లియర్ చేసేందుకు నాన తంటాలు పడ్డారు. చివరకు ఆ అంబులెన్స్‌ లకు రూట్‌ క్లియర్‌ చేశారు. ఇక ఇందులో జి. బాలవర్ధి అనే ట్రాఫిక్‌ పోలీస్‌… రోడ్డుపైనే పరిగెత్తి మరి… ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశాడు. ట్రాఫిక్‌ పోలీస్‌ అనే విషయం మరిచిపోయి… ఆ వాహనాల మధ్య పరుగెత్తాడు. నానా కష్టాలు పడి… అంబులెన్స్‌ కు దారి ఇప్పించాడు బాలవర్ధి. అంబులెన్స్ కు లైన్ క్లియర్ చేయడంతో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు వాహనదారులు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ నేపథ్యం లో ట్రాఫిక్‌ పోలీస్‌ బాలవర్ధి చేసిన పనికి ప్రశంసలు వస్తున్నాయి. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరియు హైదరాబాద్‌ సిటీ పోలీసులు కూడా బాలవర్ధి పై ప్రశంసలు కురిపించారు.

Related Articles

Latest Articles

-Advertisement-