ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ మెట్రో బంపరాఫర్

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్‌ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్‌ పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్‌ పాస్‌ ఆఫర్‌… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్‌ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్‌ మెట్రోల్‌ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్‌ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతి నెలా లక్కీ డ్రా తీయనున్నట్టు ప్రకటించారు.. పండుగ సీజన్‌ పురస్కరించుకుని ఎల్‌ అండ్‌ టీ, మెట్రో రైల్‌ ఈ ఆఫర్లను తీసుకొచ్చింది.

-Advertisement-ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ మెట్రో బంపరాఫర్

Related Articles

Latest Articles