ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో సూపర్‌ ప్లాన్‌

హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు సూపర్‌ ప్లాన్‌తో సిద్ధం అయింది. దీన్లో భాగంగానే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన అన్నారు. క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం రోజుకు 2.30 లక్షల ప్రయాణికలు మెట్రో సేవలను ఉపయో గించుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య 4 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కోవిడ్‌ తరువాత కాలంలో మిగిలి న మెట్రో నగరాల కంటే హైద్రాబాద్‌ మెట్రోలోనే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతుందన్నారు. మెట్రో ప్రయాణికుల్లో లక్కీడ్రా ద్వారా ఎంపికైన ముగ్గురు విజేతలకు ఎల్‌ఈడీటీవి, వాషింగ్‌ మెషిన్‌, మైక్రో ఓవెన్‌లను అందించారు. హైదరాబాద్‌ నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు.

Related Articles

Latest Articles