చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: కలెక్టర్‌ శర్మన్‌

విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా శర్మన్‌ హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన చిన్నారులకు వెర్సెడ్‌ బ్లూమ్‌ అవార్డులను అందజేశారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక అవార్డు వచ్చిందన్నారు. ఆ అవార్డు తనకు ఎంతో ప్రేరణ కలిగించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలని, అదే సమయంలో వారి ప్రతిభను గుర్తించి సరైన విధంగా ప్రోత్సహించి వారి మానసిక వికాసాని కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు.

Related Articles

Latest Articles