99 శాతం మంది లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తున్నారు..

99 శాతం మంది లాక్‌డౌన్‌ను స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న్ అంజ‌నీ కుమార్.. పాతబస్తీ, సౌత్‌ జోన్, సెంట్రల్ జోన్‌లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయ‌న‌.. పాతబస్తీ మదిన చెక్ పోస్ట్‌ను ప‌రిశీలించారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో లాక్ డౌన్ అమలు అవుతుంద‌ని.. 99 శాతం ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నార‌ని.. కేవలం 1 శాతం మంది ప్రజలు, యువకులు మాత్రమే అనవసరంగా బయటికి వ‌స్తున్నార‌ని.. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.. గడిచిన 16 రోజులుగా లాక్ డౌన్ పటిష్టంగా అమ‌లు చేస్తున్నామ‌న్న సీపీ.. రోజు 9 వేల కేసులు నమోదు అవుతున్నాయి… 6 వేల వాహనాలు సీజ్ అవుతున్నాయ‌న్నారు.. ఇక‌, పాతబస్తీ ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. మీ వాహ‌నాలు సీజ్ చేసేలా పోలీసులకు అవకాశం ఇవ్వకండి అని సూచించారు.. నగరంలో 180 చెక్ పోస్ట్ ల వద్ద 24/7 నిర్విరామంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్న‌ట్టు పేర్కొన్న హైద‌రాబాద్ సీపీ.. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాం.. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే చర్యలు తీసుకుంటున్నామ‌ని హెచ్చ‌రించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-