రేపే లాల్‌దర్వాజా బోనాలు.. 8 వేల మంది పోలీసులతో భద్రత

రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్‌ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు సీపీ అంజనీకుమార్.. బోనాలు, అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని.. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుందని.. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. బోనాలు విజయవంతంగా నిర్వహించేందుకు.. అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్న సీపీ.. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. లాల్‌దర్వాజలోని మహంకాళి టెంపుల్‌తో పాటు సిటీలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉండనున్నాయి.. ఎల్లుండి రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కూడా ఉండడంతో.. ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయి.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ టీవీల ద్వారా ఊరేగింపు పర్యవేక్షిస్తామని తెలిపారు సీపీ అంజనీ కుమార్.

Related Articles

Latest Articles

-Advertisement-