బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 1 న హుజురాబాద్‌ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నిక సంఘం. హుజురాబాద్ ఉప ఎన్నిక తో పాటు బద్వేల్ ఉప ఎన్నికకు కూడా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్‌ 30వ తేదీనే ఈ ఉప ఎన్నిక జరుగనుంది.

-Advertisement-బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల

Related Articles

Latest Articles