భార్యకు కరోనా..బాత్ రూంలో వదిలేసి భర్త దారుణం

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతోంది. అవును.. కరోనా వస్తే.. భార్యనే వేలేశాడు ఓ భర్త. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. కరోనా సోకిన భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో మేడి నర్సమ్మ,పెద్దయ్య అనే కుటుంబం నివాసం ఉంటోంది. నర్సమ్మకు 5 రోజుల కింద కరోనా వచ్చింది. అయితే ఇంట్లో గదులున్నా..ఆమెను బాత్ రూమ్ లో ఉంచాడు పెద్దయ్య. బయట ఓ గొయ్యి తీసి.. అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవాలని తెలిపాడు. అయితే ఆ గోతి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దయ్య ఇంటికి వచ్చిన పోలీసులు పెద్దయ్యను మందలించారు. అంతే కాదు.. పెద్దయ్యను ఒప్పించి.. ఇంట్లో ఓ గదిలో ఉంచారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-