రోజుకొకరితో భార్య కామక్రీడలు.. తట్టుకోలేని భర్త అక్కడ కొట్టి

ఎంతోమంది మహిళలు ఇష్టం లేకపోయినా బలవంతంగానో, డబ్బుకోసం పడక వృత్తిలోకి దిగుతున్నారు. వారిని అందరు ఎంత నీచంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి స్థితిలో ఉన్న ఒక మహిళను.. ఒక వ్యక్తి ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. మంచి జీవితాన్ని ఇచ్చాడు.. కానీ ఆమె మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు.. అంత మంచి జీవితం ఉన్నా కానీ వదిలేసి వచ్చిన ఆ వ్యభిచార బుద్దిని మాత్రం పోగొట్టుకోలేదు. భర్త లేని సమయంలో పరాయి మగాళ్లతో వృత్తి కొనసాగించింది. విషయం తెలుసుకున్న భర్త ఉక్రోషంతో ఆమెను అంతమొందించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కర్నూల్ జిల్లా సిరివెల్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన పార్ష శ్రీధర్ లారీ క్లీనర్ గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అర్ధరాత్రి లోడ్ దింపడానికి వెళ్లి వస్తూ రోడ్డు మీద కొంతమంది మహిళలను చూశాడు. వారు వేశ్యలని తెలిసిన అతనికి వారిలో తిరుపతమ్మ అనే మహిళ నచ్చింది. ఈ వృత్తి వదిలేస్తే తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై ఒక బాబు ఉండగా.. భర్త వదిలేయడంతో ఆమె ఈ వృత్తిలోకి వచ్చిందని తెలుసుకొని బాబు అతని బాధ్యత కూడా తీసుకొంటానని చెప్పాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కొద్దిరోజులు సవ్యంగా నడిచిన వారి కాపురంలో మనస్పర్థలు నెలకొన్నాయి. భార్య, భర్తకు తెలియకుండా తన గత వృత్తిని మొదలుపెట్టింది. భర్త బయటికి వెళ్లడం ఆలస్యం.. పరాయి మగాళ్లను ఇంటికి పిలిపించుకొని కామక్రీడల్లో మునిగి తేలుతుండేది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న భర్త, భార్యను నిలదీశాడు. ఇలాంటివి మానుకోవాలని నచ్చజెప్పాడు. అయినా భార్య వినలేదు. దీంతో శ్రీధర్ భార్యను ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ పాన్ తో తలపై కొట్టి హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles