భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. నగ్నంగా మంచానికి కట్టేసి

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక భర్త తన భార్యను అతిదారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురానగర్ లోని ఒక ఇంట్లో డాలీ(45) అనే వ్యక్తి భార్య స్మృతి(35)తో కలిసి ఉంటున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బయటికి వెళ్లిన డాలీ ఇంటికి రాలేదు.. భార్య కూడా బయటికి రావడంలేదు.. దీంతో స్థానికులు వారి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడ భరించలేనంత దుర్వాసన రావడంతో వెంటనే స్థానికులు డోర్ బద్దలు కొట్టి చూసి షాక్ అయ్యారు. అక్కడ మంచానికి స్మృతి శవం నగ్నంగా కట్టేసి ఉంది.

చుట్టూ కరెంట్ వైర్లు ఉండడంతో కరెంట్ షాక్ వలనే ఆమె మృతిచెంది ఉండవచ్చని స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య ఖచ్చితంగా భర్తే చేసి ఉంటాడని, అతడు రెండు రోజుల నుంచి కనిపించడం లేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles