నల్లగా ఉందని భార్యకు విడాకులిచ్చిన భర్త

యూపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్య నల్లగా ఉందని ఆరోపిస్తూ పెళ్లయిన 9 నెలలకు ఓ భర్త విడాకులిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న ఓ మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు. మహిళ తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని హింసించారు.

Read Also: దారుణం: ఆ పనికి ఒప్పుకోలేదని.. చర్చికి పిలిచి యాసిడ్ పోసిన మహిళ

అయితే అత్తింటి వారి డిమాండ్‌కు మహిళ అంగీకరించలేదు. దీంతో వేధింపులకు గురిచేయడమే కాకుండా చివరకు నల్లగా ఉందనే కారణంతో ఆమెకు విడాకులిచ్చి భర్త, అత్తింటి వారు తలాక్ చెప్పి బయటకు పంపించేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను గృహహింసకు గురిచేసి తలాక్ చెప్పడమే కాకుండా నల్లగా ఉందని హేళన చేసేవారని అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles