సోషల్ మీడియా మోజులో పడి భార్య పట్టించుకోవట్లేదని..

సోషల్‌ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సనత్‌ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట బాగానే సాగిన వీరి సంసారం.. కొద్ది నెలల నుండి ఇద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తడం మొదలయ్యాయి. సంతానం లేకపోవడంతో మనస్పర్థలు అధికమయ్యాయి. మౌనిక తరచూ సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తుండటం వల్ల తరచూ గొడవలు జరిగేవి. కోవిడ్‌ లాక్ డౌన్ టైంలో పవన్ తన కాంట్రాక్ట్‌ ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలా అన్ని రకాల సమస్యల వల్ల మానసిక సంఘర్షణకు గురైన పవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు పవన్ ఆత్మహత్యకు తన కోడలు మౌనిక కారణమని ఫిర్యాదు చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-