జ‌ర్మ‌నీలో మెర్కెల్‌కు చుక్కెదురు… 16 ఏళ్ల పాల‌న‌కు చెక్ ప‌డ‌నుందా?

జ‌ర్మ‌నీలో  చాన్స‌లర్ మెర్కెల్ 16 ఏళ్ల పాల‌న‌కు చెక్ ప‌డ‌నుందా అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు అవున‌నే అంటున్నాయి.  జ‌ర్మ‌నీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెర్కెల్ పార్టీకి 196 సీట్లు సాధించ‌గా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న సోష‌ల్ డెమోక్రాట్స్ పార్టీ 206 స్థానాల్లో విజ‌యం సాధించింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నిక‌ల్లో గ్రీన్ పార్టీ 118 సీట్లు, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ 92 సీట్లు సాధించింది.  ప్ర‌ధాన ప్రత్య‌ర్థులైన క్రిస్టియ‌న్ యూనియ‌న్ పార్టీ, సోష‌ల్ డెమోక్రాట్ల పార్టీల‌లో ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నా గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ పోత్తు అవ‌స‌రం.  దీంతో ప్ర‌ధాన పార్టీలు ఈ రెండు పార్టీలతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఈసారి ఎలాగైన కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని సోష‌ల్ డెమోక్రాట్ నేత‌, చాన్స‌లర్ అభ్య‌ర్ధి ఒలాఫ్ షోల్జ్ చెబుతుండ‌గా, ఈసారి కూడా తామే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని మెర్కెల్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.  ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్న‌ది మ‌రో కొన్ని గంట‌ల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: మ‌రోసారి సంక్షోభంలో పంజాబ్ కాంగ్రెస్‌…!!

-Advertisement-జ‌ర్మ‌నీలో మెర్కెల్‌కు చుక్కెదురు... 16 ఏళ్ల పాల‌న‌కు చెక్ ప‌డ‌నుందా?

Related Articles

Latest Articles