డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ‘హమ్ దో హమారే దో’

రాజ్ కుమార్ రావ్, కృతీసనన్ జంటగా నటించిన సినిమా ‘హమ్ దో హమారే దో’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. అభిషేక్ జైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. గతంలో ‘స్త్రీ’, ‘లూకా చుప్పి, బాలా, మిమి’ చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రంలో పరేశ్ రావెల్, రత్నా పాఠక్, అపర్ శక్తి ఖురానా ఇతర కీలక పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్ళయిన ఓ జంట ఇద్దరు పేరెంట్స్ ను పెంచుకోవాలని అనుకుంటుంది. ఆ నిర్ణయం వీరి జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందనే అంశాన్ని హాస్యస్పోరకంగా దర్శకుడు అభిషేక్ తెరకెక్కించాడని తెలుస్తోంది.

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో 'హమ్ దో హమారే దో'
-Advertisement-డిస్నీప్లస్ హాట్ స్టార్ లో 'హమ్ దో హమారే దో'

Related Articles

Latest Articles