శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి

గత రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి లక్షకు పైగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,29,038 క్యూసెకులు ఉండగా ప్రస్తుతం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,76,535 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం తో పాటుగా కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు ఉండటంతో ఈ వరద మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

-Advertisement-శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉదృతి

Related Articles

Latest Articles