శ్రీశైలంకు భారీగా వరద నీరు…

శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా పెరుగుతుంది. నేడు జూరాల నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 85,098 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 7,063 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 816.10 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 38.0672 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా… కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-