జంట జలాశయాల గేట్లు ఎత్తివేసే అవకాశం…

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ క్షణంలో అయినా జంట జలాశయాల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785 అడుగులకు నీరు వచ్చి చేరింది. ఇక హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 కాగా 1762 కు నీరు వచ్చి చేరింది. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే జంట జలాశయాల క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. మూసి పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత వాసులకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. జంట జలాశయాలల్లో భారీగా వరద నీరు వస్తుండడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి మంచి నీరు పుష్కలంగా లభిస్తుంది అని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-