ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధుల గోల్ మాల్…

విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు సిబ్బంది. వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సర్కిల్-4లో వెలుగు చూసిన సిబ్బంది చేతివాటంతో విచారణ మొదలయింది. ఫేక్ చలాన్ల తో బ్యాంకు, ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు మాయం చేసారు. రెండు షాపుల్లో 17లక్షలు తేడా గుర్తించారు అధికారులు. అయితే ఇందులో ఎక్సయిజ్ సిఐ ప్రమేయం ఉన్నట్లు గుర్తించి సిఐ శ్రీనివాస్ పై వేటు వేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-