బరువు తగ్గేందుకు బాక్సింగ్ మొదలెట్టిన భారీ బ్యూటీ!

తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది సమీరా రెడ్డి. అయితే, టాలీవుడ్ లో ఎందుకోగానీ బిజీ కాలేకపోయింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసినా కూడా వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదనుకుని పెళ్లి చేసుకున్న డస్కీ బ్యూటీ తల్లి కూడా అయింది. అయితే, సమీరాను చాలా రోజులుగా అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్నాళ్ల క్రిందట ఆమె ఓవర్ వెయిట్ గురించి బాధపడుతూ ఓ పెద్ద పోస్ట్ కూడా పట్టింది. సినిమా హీరోయిన్స్ కి లుక్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ సూపర్ ఫిజిక్ ని చెడగొట్టే అధిక కొవ్వు ప్రమాదకరమే కదా! అందుకే, అప్పట్లో సమీరా కెరీర్ పై ఓవర్ వెయిట్ ఓవర్ గానే ఎఫెక్ట్ చూపింది. ఇక ఇప్పుడు ఈ సూపర్ మామ్ మళ్లీ పర్ఫెక్ట్ ఫిట్ గా మారేందుకు జిమ్ లో రకరకాల ఎక్సర్సైజులు చేస్తోంది. వాటి గురించి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోయర్స్ తో పంచుకుంటోంది.

సమీరా రెడ్డి లెటెస్ట్ ఫిట్ నెస్ అప్ డేట్ లో తాను 9కేజీలు బరువు తగ్గానని ఫుల్ జోష్ తో చెప్పింది. అయినా కూడా సమీరా రెడ్డి ప్రస్తుత బరువు 83కేజీలట! ఇంకా 8కేజీలు తగ్గితేగానీ తన టార్గెట్ అయిన 75 కేజల మార్క్ వద్దకి చేరుకోలేనని ఆమె చెబుతోంది. అయితే, ఇంత కాలం తాను పడ్డ కష్టం ఇప్పుడు ప్రతిఫలం ఇస్తోందని సమీరా సంతోషంగా చెబుతోంది. ఇక వెనక్కి తిరిగి చూసేదే లేదు అంటోంది. తప్పకుండా మరింతగా చిక్కి… చక్కటి రూపంలో… ఛమక్కున మెరిసిపోతానంటోంది! సమీరా రెడ్డి సహజంగానే కాస్త బొద్దుగా ఉంటుంది. ఆ మధ్య మరింత లావైపోయింది. పెళ్లి తరువాత ప్రెగ్నెన్సీ కాలంలో ఓవర్ గా ఓవర్ వెయిట్ కు గురైంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, యోగ… ఇలా చాలా ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు 92కేజీల భారీ బ్యూటీ 83కి చేరుకుంది. 75కేజీల తన ఫిట్ నెస్ మార్క్ చేరుకునేందుకు ప్రస్తుం బాక్సింగ్ కూడా చేస్తోందట! త్వరలో తన బాక్సింగ్ ప్రాక్టిస్ వీడియో అప్ లోడ్ చేస్తాను… స్టే ట్యూన్డ్… అని ప్రకటించింది! చూడాలి మరి, సమీరా రెడ్డి బాక్సింగ్ అప్ డేట్ ఎంత హార్డ్ అండ్ హాట్ గా ఉండబోతోందో…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-