బీపీని ఇలా వాచ్‌తో చెక్ చేసుకోవ‌చ్చు…

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం హువాయి స‌రికొత్త వాచ్ ను విప‌ణిలోకి విడుద‌ల చేయ‌బోతున్న‌ది.  స్మార్ట్ ఫోన్ త‌యారీ రంగంలో దూసుకుపోతున్న హువాయి కంపెనీ, ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల‌ను విప‌ణిలోకి ప్ర‌వేశ పెట్టింది.  కాగా, త్వ‌ర‌లోనే వాచ్ డీ పేరుతో మ‌రో కొత్త స్మార్ట్ ప్రొడ‌క్ట్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ది.  ఈ స్మార్ట్ వాచ్‌లో అన్ని అధునాత‌న‌మైన ఫీచ‌ర్ల‌తో పాటు స‌రికొత్త ఫీచ‌ర్‌ను లాంచ్ ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ది.  

Read: కిషన్‌రెడ్డి సిపాయిలా పోరాడాలి : కేసీఆర్‌

వాచ్‌ను చేతికి పెట్టుకుంటే శ‌రీరంలోని బ్ల‌డ్ ప్రెజ‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేస్తూ హెచ్చ‌రిస్తుంద‌ని హువాయి అధికారులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం ఈ వాచ్ డీ టెస్టింగ్ ద‌శ‌లో ఉంద‌ని, డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఈ వాచ్‌ను విప‌ణిలోకి విడుద‌ల చేస్తామ‌ని  కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  ఇప్ప‌టికే స్టేట్ డ్ర‌గ్ అడ్మిష‌న్ క్లాస్ 2 డివైజ్ స‌ర్టిఫెకెట్‌ను పొందిన‌ట్టు వాచ్ డీ త‌యారీదారులు చెబుతున్నారు.  మిగ‌తా అన్ని అనుమ‌తులు తీసుకొని డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఈ వాచ్‌ను విప‌ణిలోకి విడుద‌ల చేస్తామ‌ని హువాయి కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  

Related Articles

Latest Articles