మేజర్ : “వినవే హృదయమా”… సిద్ శ్రీరామ్ మరో క్లాసిక్ సాంగ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన “మేజర్” చిత్రం విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి పాటను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. “హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది. ఈ పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ప్లేలిస్ట్‌ లో ఈ సాంగ్ టాప్ లో ఉంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Read Also : కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్

ఇక దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన మలయాళం వెర్షన్ ‘పొన్ మలారే’ పాటకు కూడా సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది. మలయాళంలో ఐరాన్ ఈ పాటను పాడారు. “మేజర్‌”లో సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

Related Articles

Latest Articles