మీరెలాంటి పాస్ వర్డ్ వాడుతున్నారు.. అది సేఫేనా?

ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగినా కొన్ని సాంకేతిక పరమయిన ఇబ్బందులు తప్పడం లేదు. హ్యాకర్లు మనమీద ఓ కన్నేసి వుంచుతున్నారు. అవకాశం చిక్కితే మన సొమ్ము లాగేయడానికి సిద్ధంగా వుంటారు. వీక్ పాస్ వర్డ్ ల విషయంలో ముందువరుసలో భారత్ ఉంది. సులభమైన పాస్​వర్డ్స్​ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించే ప్రమాదం వుంది. పాస్‌వర్డ్స్‌ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్‌ క్రోమ్‌ తనవంతు పాత్ర పోషిస్తోంది. మన ఆన్‌లైన్‌ ఖాతాలకు సెట్‌ చేసిన పాస్‌వర్డ్స్‌ భద్రంగా ఉన్నాయా లేదా అన్న చిన్న సందేహం వస్తుంది. మన బ్యాంకింగ్‌, సోషల్‌ మీడియా అకౌంట్స్‌.. ఇలా ఏ అకౌంట్స్‌ నుంచైనా మన వ్యక్తిగత సమాచారం వారికి దొరికిందంటే మన కథ కంచికి చేరినట్టే.

అలా జరగకుండా పాస్‌వర్డ్స్‌ విషయంలో మనం అప్రమత్తం కావాలి. మన పాస్ వర్డ్ హ్యాక్‌కు గురవుతుందనే ఆందోళన ఇక అవసరం లేదు. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌ లో ఎప్పుడైనా హ్యాకింగ్‌కు గురైతే వెంటనే గుర్తించి నోటిఫికేషన్‌ రూపంలో మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. పాస్‌వర్డ్‌ చెకర్‌ ద్వారా వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను క్రోమ్‌లో సేవ్‌ చేసుకోవాలి. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, జీమెయిల్‌, బ్యాంక్‌ అకౌంట్స్‌… ఇలా ఏ అకౌంట్‌ అయినా గూగుల్‌తో సింక్‌ అయివుండాలి. ఎప్పుడైనా మీ అకౌంట్స్‌ను మీ అనుమతి లేకుండా ఎవరైనా యాక్సెస్‌ చేస్తున్నట్లు అనుమానంగా ఉంటే ఒకసారి చెక్ చేసుకునే అవకాశం వుంది.

మీ అకౌంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను గూగుల్‌ క్రోమ్‌ సర్వర్లకు పంపి విశ్లేషించే సౌలభ్యం వుంది. మీ పాస్‌వర్డ్‌ తేలికగా, ఈజీగా వుంటే మార్చుకోవచ్చు. హ్యాకర్స్‌కు దొరక్కుండా వుండాలంటే ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ని మరోసారి వాడకూడదని సలహా ఇస్తున్నారు టెక్ నిపుణులు. కొందరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అన్ని ఆన్‌లైన్ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ ఉపయోగిస్తారు. అది ఎంతమాత్రం మంచిదికాదు. పాస్‌వర్డ్స్‌ ఎప్పుడూ అక్షరాలు, సింబల్స్‌, పంక్చువేషన్‌తో కలిసి ఉండాలి. ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, పిల్లల పుట్టిన రోజులు వుండకూడదు. తరచూ మీ పాస్ వర్డ్ మార్చుకుంటూ వుండండి.

Related Articles

Latest Articles