“ది ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ రియల్ స్టంట్స్…!!

ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగడంతో అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేశారు. త‌మిళ ఈలం కు చెందిన ఉద్య‌మ‌కారిణి పాత్రను సమంత పోషించడం, తమిళులను ఉగ్రవాదులుగా చూపిస్తున్నారంటూ తమిళ తంబీలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మరోవైపు సమంత పోషించిన రాజి పాత్ర‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పాత్ర కోసం సామ్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఏకంగా ఫైట్ సీన్లలో కన్పించి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా విడుదలైన ఓ వీడియోలో ఈ చెన్నై సోయగం చేస్తున్న రియల్ స్టంట్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-