“పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also : ‘అన్‌స్టాపబుల్’ రేర్ ఫీట్… ఆహా అన్పిస్తున్న బాలయ్య షో

పుష్ప పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ 22 కోట్ల రూపాయలను చెల్లించిందని వినికిడి. థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా మేకర్స్ డిజిటల్ గా ప్రసారం చేయడం గమనార్హం. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. టీమ్ ఇటీవల సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం విరామం తీసుకుంటున్నాడు. మార్చి నుండి ‘పుష్ప 2’ చిత్రీకరణను ప్రారంభించనున్నార. ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను సుకుమార్‌ ప్రారంభించాడు. ‘పుష్ప 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Related Articles

Latest Articles