వ్యాక్సిన్ తీసుకుంటే టెస్లా కారు ఫ్రీ…

క‌రోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌జలు ముందుకు రావ‌డంలేదు.  దీంతో వ్యాక్సిన్ వేయ‌డం ఇప్పుడు కొన్ని దేశాల‌కు స‌వాల్‌గా మారింది.  ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ స‌మ‌స్య అధికంగా ఉన్న‌ది.  కావాల్సిన‌న్ని వ్యాక్సిన్లు ఉన్న‌ప్ప‌టికీ తీసుకునేందుకు ప్ర‌జ‌లు ముందుకు రావ‌డంలేదు.  దీంతో అధికారులు, వ్యాపాద‌వేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు వ్యాక్సినేషన్ కోసం భారీ బ‌హుమ‌తులు ప్ర‌క‌టిస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు క‌డ్డీలు ఇస్తామ‌ని, మిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దును అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌తిస్తున్నారు.  స‌న్ హ్యాంగ్ కాయ్ ప్ర‌పాప‌ర్టీస్ సంస్థ ఐఫోన్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా హాంకాంగ్‌లోని ఆస్ట్రేలియా సంస్థ గుడ్‌మ్యాన్ గ్రూప్ ఆస‌క్తిక‌ర‌మైన బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది.  ఆగ‌స్టు 31 లోగా వ్యాక్సినేష‌న్ పూర్తిచేసుకుంటే, లాట‌రీ ద్వారా మిలియ‌న్ హాంకాంగ్ డాల‌ర్ల న‌గ‌దు ఇస్తామ‌ని, అంతేకాకుండా టెస్లా మోడ‌ల్ 3 కారును కూడా అందిస్తామని ప్ర‌క‌టించింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-