ఏపీలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్టు…

ఏపీలో హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. అమాయకులకు అమ్మాయిల తో ట్రాప్ ( హనీ ట్రాప్) చేస్తున్న ముఠాను అరెస్టు చేసారు ఏలూరు త్రి టౌన్ పోలీసులు. సుష్మ చౌదరీ, ఉమామహేశ్వరరావు, కుమారీ, షేక్ నాగూర్ అనే వారిపై కేసు నమోదు చేసారు. వారి వద్ద నుండి 25 గ్రాముల బంగారం,కారు, ఆరు సెల్ ఫోన్లు లక్షా యాబైవేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలలో గొడవలు కారణంగా సైనేడ్ తో గుంటూరు కి చెందిన శశి చౌదరి అనే వ్యక్తి ని సుష్మా చౌదరి చంపేసింది. ఈ ముఠా రైస్ పుల్లింగ్, గుప్త నిధుల పేరుతో అనేకమంది వద్ధ డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. వీరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.

-Advertisement-ఏపీలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్టు...

Related Articles

Latest Articles